ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ కోర్సుల ప్రవేశాల గడువు పెంపు

దూర విద్యా విధానంలో టెన్త్, ఇంటర్ కోర్సులను పూర్తి చేయాలనుకునే వారి కోసం తెలంగాణ ఓపెన్ స్కూల్‌ సొసైటీ (TOSS) ప్రవేశాల గడువును మరో రెండు రోజులపాటు పొడిగించారు.

ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్‌ ప్రవేశాల గడువును ఈనెల 31 వరకు పొడిగించారు. టాస్‌ దూర విద్యా విధానంలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ కోర్సులను అందిస్తున్నది.

ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. అడ్మిషన్‌ ప్రక్రియను ఇప్పటికే ఒకసారి పొడిగించారు. నేటితో ఆ చివరితేదీ ముగినయనుండటంతో మరోమారు దరఖాస్తు చివరితేదీని పొడిగించారు.

◆ వెబ్సైట్ ::‌ www.telanganaopenschool.org