JEE MAINS – 2021 ఎప్రిల్ సెషన్ పరీక్షల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.

దేశంలోని అత్యున్నత విద్యా సంస్థలైన IIT, NITల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE MAINS – 2021 ఏప్రిల్‌ సెషన్‌ కి( 3వ సెషన్) రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమయ్యింది.

JEE MAINS – 2021 రాయాలనుకున్న విద్యార్థులు అధికారిక వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని NTA సూచించింది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మూడవ విడత JEE MAINS – 2021 పరీక్ష ఏప్రిల్‌ 27 నుండి 30 వరకు జరగనుంది. జేఈఈని ఈ ఏడాది విడుతల వారీగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి, మార్చిలో రెండు సెషన్లు పూర్తయ్యాయి. వచ్చే నెలలో మూడో సెషన్‌ పరీక్ష జరుగనుంది. ఆన్లైన్‌ రిజిస్ట్రేషన్లు ఎప్రిల్ 4న ముగియనుంది.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారితో పాటు, తొలి రెండు సెషన్లు రాసిన వారు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు