కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2021-22 విద్యా సంవత్సరానికి గాను ఒకటవ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలయ్యింది.

★ ఒకటవ తరగతి అడ్మిషన్లు ::

ఏప్రిల్‌ 1న ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని, అధికారిక వెబ్సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ వెల్లడించింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు ఏప్రిల్‌ 19 చివరి తేదని తెలిపింది.

★ రెండవ తరగతి నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ::

రెండవ తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాలకు ఏప్రిల్‌ 8 (ఉదయం 8 గంటలకు) నుంచి ఏప్రిల్‌ 15 (సాయంత్రం 4 గంటలు) వరకు ఆఫ్‌ లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపింది.

★ 11వ తరగతి అడ్మిషన్లు ::

11వ తరగతిలో ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్‌ పత్రాలను కేంద్రీయ విద్యాలయ వెబ్సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

★ వెబ్సైట్ :: https://kvsangathan.nic.in/academic/admission-guidelines

★ నోటిఫికేషన్ pdf file

https://drive.google.com/file/d/12qJQOF_zmLGRm3_Ux81ek167euDVel3I/view?usp=drivesdk