పల్లాను ఘనంగా సన్మానించిన ఇంటర్ విద్యా జేఏసీ.

తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం (GJLA), ఆఫీస్ కి ఈ రోజు నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో రెండవసారి ఘన విజయం సాదించిన రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వేర్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఇంటర్ విద్య JAC తరుపున ఘనంగా సన్మానించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నా గెలుపుకు కృషి చేసిన నాయకులకు మరియు అధ్యాపకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని తెలిపారు. అలాగే కచ్చితంగా ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఉన్న సమస్యలు, రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకుల, నాన్ టీచింగ్ సిబ్బంది సమస్యలను ఒక్కొకటిగా పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఇంటర్ విద్యా జేఏసీ ఛైర్మన్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి మరియు ప్రిన్సిపాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ రామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళింగ కృష్ణకుమార్ మరియు ఇంటర్ విద్య జేఏసీ కో కన్వీనర్, 711సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి లక్ష్మణ్ మరియు రాష్ట్ర నాయకులు జిల్లా నరసింహ, యాదద్రి జిల్లా అధ్యక్షులు మెరుగు లింగయ్య , సూర్యాపేట జిల్లా అధ్యక్షులు హేమచందర్ రెడ్డి మరియు జిల్లా ప్రధాకార్యదర్శి వనపర్తి శ్రీనివాస్, మెరుగు లింగయ్య మరియు, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు రవి, తదితరులు పాల్గన్నారు పాల్గొన్నారు.