పల్లాని సన్మానించిన జూనియర్ అతిధి అధ్యాపకుల సంఘం – యాకుబ్ పాషా

వరంగల్ – నల్గొండ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం 1145 నాయకులు శుక్రవారం నాడు హైద్రాబాదులోని నాంపల్లి ఇంటర్ విద్యార్థి జేఏసీ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిసి చిరు సన్మానం చేశారు.

ఈ సందర్బంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకుబ్ పాషా పల్లా రాజేశ్వర్ రెడ్డి తో మాట్లాడుతూ.. గెస్ట్ లెక్చరర్ల కొనసాగింపుకై పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన కృషి అభినందనీయమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1500 మంది గెస్ట్ లెక్చరర్ల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పల్లాకు మద్దతు ఇచ్చి వారి గెలుపుకై గెస్ట్ లెక్చరర్ల సంఘం నాయకులు తీవ్రంగా శ్రమించినట్లు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే గెస్ట్ లెక్చరర్లకు అన్నివిధాల ఆదుకోవాలని ఈ విద్యా సంవత్సరం పూర్తి బడ్జెట్ విడుదల చేయాలని, పీరియడ్లతో సంబంధం లేకుండా వేతనాలను అందించే విధంగా సహకరించాలని, ప్రతీ సంవత్సరం రెన్యూవల్ ఇబ్బందులు తలెత్తకుండా ఇంటర్మీడియట్ వ్యవస్థలో పనిచేసే ఇతర తాత్కాలిక ఉద్యోగుల మాదిరిగానే విద్యాసంవత్సరం ప్రారంభం నుండే ఆటో రెన్యూవల్ అయ్యే విధంగా చూడాలని కోరారు.

సమస్యలను సావధానంగా విన్న పల్లా స్పందిస్తూ..వీలైనంత త్వరగా సంబంధిత కార్యదర్శి, విద్యాశాఖ మంత్రితో మాట్లాడి అన్ని సమస్యలపై చర్చించి పరిష్కారం అయ్యేలా చూస్తానని, ఎన్నికలలో తన గెలుపుకోసం కష్టపడిన గెస్ట్ లెక్చరర్ల సంఘం నాయకులను అభినందించి, ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకూబ్ పాషా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ , కీర్తి ,ఉపేంద్ర చారి మధుసూదన్ రెడ్డి ,రాంప్రసాద్ బిలాల్, షారూఫ్, మోహిత్ పాషా, భాగ్య రేఖ, దామర్ల ప్రభాకర్ అవసరం ప్రభావతి, మంజుల తదితరులు పాల్గొన్నారు