మాదంశెట్టి వరూదినికి చరిత్ర విభాగంలో డాక్టరేట్

కాకతీయ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థిని మాదం శెట్టి వరూధినికి కాకతీయ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఎన్.మహేందర్ రెడ్డి బుధవారం డాక్టరేట్ ను ప్రకటించారు. చరిత్ర విభాగంలో పరిశోధకురాలిగా వరూధిని డాక్టరేట్ పొందారు.

జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మాదంశెట్టి వరూదిని కాకతీయ యూనివర్సిటీ చరిత్ర విభాగం రిటైర్డ్ సీనియర్ ఆచార్యులు ఎన్.శ్రీనాథ్ పర్యవేక్షణలో క్రీస్తు శకం 1000-1323 కాకతీయుల కాలంలోని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో జరిగిన అభివృద్ధి (ఆస్పెక్ట్స్ ఆప్ కల్చర్ సొసైటీ అండ్ ఎకానమీ డురింగ్ ద కాకతీయాస్ ) అనే అంశంపై ఆమె పరిశోధన గ్రంధం సమర్పించాగా వరూధినికి డాక్టరేట్ లభించింది.

వరూధిని పలు సదస్సుల్లో పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాల కో-ఎడ్యుకేషన్ – జనగామ నందు చరిత్ర ఒప్పంద అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం 475 రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్ మరియు కళాశాల అధ్యాపకులు మరిపెల్ల రవి ప్రసాద్, కదిరే రవీందర్,తిరుమలేష్, ముక్తాదిర్,ఇంతియాజ్,హిశ్రాత్ భాను,సవ్వసి శ్రీనివాస్, కాపర్తి శ్రీనివాస్,ప్రియదర్శిని,శంకర్, రేఖా, షహనాజ్ మరియు కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం వరూధినిని అభినదించారు.