పాఠశాలలు మూసివేయండి – వైద్యారోగ్య శాఖ సూచన

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే పదవ తరగతి వరకు పాఠశాలలను, గురుకులాలను, వసతి గృహాలను వెంటనే మూసివేయాలని రాష్ట్ర వైద్యా ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 700 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు సమాచారం.

దీనిపై సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒకటీ, రెండు రోజుల్లో ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు కరోనా వేగంగా వ్యాప్తి చెందడానికి వాహకులుగా మారుతున్నట్లు వైద్యాధికారులు బావిస్తున్నారు.