కాసేపట్లో పీఆర్సీ ప్రకటన. ఎంత శాతం పెంచితే ఎంత వేతనం.?

తెలంగాణ తొలి పిఆర్సీ కమిటీ తన రిపోర్ట్ ను డిసెంబర్ 31 2020 న ప్రభుత్వానికి సమర్పించారు. కేవలం 7.5% పిట్మెంట్ తో తన నివేదిక సమర్పించడం పై ఉద్యోగ వర్గాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులు సంతోష పడే విధంగా దేశంలోనే అత్యధిక వేతనాలు పొందే విధంగా పిఆర్సీ ఉండనుందని ఉద్యోగ సంఘాలతో అన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ తొలి పీఆర్సీ ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించనున్నారు. ప్రభుత్వ మరియు ఉద్యోగ వర్గాల సమాచారం ప్రకారం 29 నుండి 34 శాతం మధ్యాహ్నం పిఆర్సి ఉండనున్నట్లు సమాచారం. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం పిఆర్సీ భారం 8 వేల కోట్లుగా తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఈ లెక్కల ప్రకారం 29 శాతం పిఆర్సి ప్రకటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

వేతన సవరణతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61కి పెంపు, సీపీఎస్‌ ఉద్యోగులకు కుటుంబ పింఛను, ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లాల బదిలీలు, పదోన్నతులు, పండిట్‌, పీఈటీల ఉన్నతీకరణ, పదివేల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు, పాఠశాలల్లో పారిశుద్ధ్య సిబ్బంది నియామకాలు వంటి సమస్యలను పరిష్కరించేందుకు స్పష్టమైన హమీ లబించనుంది.

దాదాపు 9 లక్షల మంది రెగ్యులర్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరియు పింఛన్ దారులకు ఈ పీఆర్సీ ద్వారా భారీ ఊరట లభించనుంది.

అయితే కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ సారి రెగ్యులర్ ఉద్యోగులతో పీఆర్సీ ప్రకటించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే పీఆర్సీ నివేదిక లో కూడా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పీఆర్సీ అమలు చేయాలని నివేదిక లో పేర్కోంది.

PRC CHART