టీడీఎస్ విషయంలో ఐటీ శాఖకు అప్పీల్ కి ఇంటర్ కమీషనరేట్.!

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల వేతనాల నుండి టీడీఎస్ విధించాలని, గత రెండు సంవత్సరాలుగా టీడీఎస్ విధించని నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ డీడీవోలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయం పైన కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపక సంఘం నాయకుడు కొప్పిశెట్టి సురేష్ మరియు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నేతృత్వంలో ఇంటర్ విద్య కమిషనర్ ని మరియు ఆదాయపు పన్ను శాఖ అధికారులను కలిసి టీడిఎస్ విధించ వద్దని కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులు ఐటీ పరిధిలోకి రారాని విన్నవించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇంటర్ విద్య కమిషనర్ నోటీసులు అందుకున్న డీఐఈవో మరియు నోడల్ ఆఫీసర్లకు సంబంధిత విషయం గురించి తాజాగా సూచనలు చేశారు.

నోటీసులు అందుకున్న తేదీ, ఆదాయపు పన్ను శాఖకు అప్పీల్ చేయడానికి గల చివరి తేదీ లను తెలుపుతూ ఐటీ కాపీలను, ఐటీ ఆర్డర్ కాపీలను‌, ఎకానాలెడ్జమెంట్ కాపీలను‌, 2019 – 20 సంవత్సరానికి సంబంధించిన జూనియర్ కాంట్రాక్టు అధ్యాపకుల బాండ్, 2019 – 20 ఐటీ రిటర్న్ కాపీ లు, తదితర వివరాలతో ఇంటర్మీడియట్ కమీషనరేట్ లో రేపటి వరకు రిపోర్టు చేయాలని సూచించారు.

కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు సంబంధించిన టీడీఎస్ విషయంలో ఆదాయపు పన్ను శాఖకు అప్పీల్ కి వెళ్ళడానికి ఇంటర్మీడియట్ కమీషనరేట్ వర్గాలు సిద్ధమైనట్లు సమాచారం.