పీఆర్సీ ప్రకటనకు ఎలక్షన్ కమిషన్ అనుమతి

తెలంగాణలో రాష్ట్రంలో ఉద్యోగులకు వేతన సవరణను ప్రకటించేందుకు ఎన్నికల కమిషన్ అంగీకారాన్ని తెలిపింది నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగుల్లో అనుమానం ఉండేది. ఇప్పుడు పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది.

పీఆర్సీ ప్రకటనకు అనుమతి కావాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ఎన్నికల సంఘంను కోరింది. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే తద్వారా ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించరాదని ఈసీ స్పష్టం చేసింది. పీఆర్సీని శాసనసభలోనే ప్రకటిస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ వెల్లడించిన విషయం తెలిసిందే.