కరోనా కారణంగా మళ్లీ ఆన్లైన్ తరగతుల వైపు మొగ్గు.!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు వివిధ నగరాలలో లాక్ డౌన్ కి విధిస్తున్న విషయం తెలిసిందే. చాలా రాష్ట్రలలో ఇప్పటికే ప్రారంభించిన విద్యా సంస్థలను కూడా మళ్లీ మూసి వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ పొరుగు రాష్ట్రం అయిన మహారాష్ట్రలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు మూడు రోజుల్లోనే కరోనా వ్యాప్తి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ మంత్రులు మరియు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

● పాక్షిక లాక్ డౌన్ ::

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో కరోనా వ్యాధి అదుపులో ఉన్నప్పటికీ లాక్ డౌన్ విధించడానికే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయి. విద్యా సంస్థలు మూసివేత, సినిమా హాల్స్ మూసివేత, బహిరంగ సభలు నిషేధం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే సంపూర్ణంగా కాకుండా పాక్షిక లాక్డౌన్ అమలు విషయం చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాత్రి పూట కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది.

● విద్యార్థులు విషయంలో జాగ్రత్తలు ::

ముఖ్యంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలలో కరోనా బారిన పడే విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చదవుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టలేమని స్వయంగా కేసీఆర్ తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యాసంస్థల మూసివేత పై స్పష్టమైన నిర్ణయం రెండు మూడు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది.

ఇప్పటికీ ఆన్లైన్ తరగతులు ఒకవైపు భౌతిక తరగతిలో ఒక వైపు జరుగుతున్న నేపథ్యంలో మరల ఆన్లైన్ తరగతులు పూర్తి స్థాయిలో కొనసాగించె ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు సమాచారం.