తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్

తెరాస అభ్యర్థి సురభి వాణి దేవి విజయం

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మీద రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా విజయం సాధించారు.

విజయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపట్లో ఎన్నికల కమిషన్ చేయనుంది.

04:00 PM :: రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు లో ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం 90 మందిని ఎలిమినేట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి చిన్నారెడ్డి ఎలిమినేట్ అయినా తర్వాత మిగిలిన వాణీ దేవి, రాంచంద్రరావు‌, నాగేశ్వర్… ప్రస్తుతం3వ స్థానంలో ఉన్న నాగేశ్వర్ ఎలిమినేషన్ ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు

★ సురభివాణీ దేవి – 1,28,010

★ రామచంద్రరావు – 1,19,198

★ నాగేశ్వర్ – 67,383

12:30 PM ::వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు లో ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం 67 మందిని ఎలిమినేట్ చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాముల్‌ నాయక్‌ ఎలిమినేట్‌ అయ్యారు. అనంతరం టాప్ టాప్ త్రీ అభ్యర్థుల ఓట్లు

● పల్లా రాజేశ్వర్ రెడ్డి -1,22,638

● తీన్మార్ మల్లన్న -99,210

● కొదండరాం -89,409

11:00 AM :: రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు లో ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం 88 మందిని ఎలిమినేట్ చేశారు.

★ సురభివాణీ దేవి – 1,19,619

★ రామచంద్రరావు – 1,10,500

★ నాగేశ్వర్ – 59,648

8:00 AM :: రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు లో ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం 87 మందిని ఎలిమినేట్ చేశారు.

★ సురభివాణీ దేవి – 1,16,619

★ రామచంద్రరావు – 1,06,584

★ నాగేశ్వర్ – 56,087

8:00 AM ::వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు లో ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం 66 మందిని ఎలిమినేట్ చేశారు.

● పల్లా రాజేశ్వర్ రెడ్డి – 1,17,386

● తీన్మార్ మల్లన్న – 91,858

● కొదండరాం – 79,110

8:00 PM పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రెండు స్థానలలో మొదటి ప్రాధాన్యత ఓటుతో ఫలితం తేలకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు.

రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు లో ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం 30 మందిని ఎలిమినేట్ చేశారు.

వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు లో ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం 55 మందిని ఎలిమినేట్ చేశారు.

03:00 PM రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల 7వ రౌండ్ ఫలితాలలో ముందంజలో వాణీ దేవి ఉన్నారు. మొత్తం గా సురభి వాణీ దేవి 8,001 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

★ సురభివాణీ దేవి – 1,12,689

★ రామచంద్రరావు – 1,04,688

★ నాగేశ్వర్ – 53,610

★ చిన్నారెడ్డి – 31,554

నల్గొండ :: రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభం

వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, 7 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి. కీలకంగా మారనున్న రెండవ ప్రాధాన్యత ఓట్లు. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అధికారులు

7 రౌండ్ లు పూర్తి అయ్యేసరికి అభ్యర్థుల మొత్తం ఓట్లు.

● పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,10,840 ఓట్లు

● తీన్మార్ మల్లన్న 83,290 ఓట్లు

● కోదండరామ్ 70,072 ఓట్లు

● ప్రేమెందర్ రెడ్డి 39,107 ఓట్లు

● చెల్లని ఓట్లు 21,636

● 27,550 ఓట్ల ఆధిక్యంలో TRS పార్టీ అభ్యర్థి పల్లా

◆ గెలుపుకు కావాల్సిన రెండవ ప్రాధాన్యత ఓట్లు

◆ పల్లాకు 1,83,167 – 1,10,840= 72,327

◆ మల్లన్నకు 1,83,167 – 83,290= 99,877

◆ కోదండరాంకు 1,83,167-70,072= 1,13,095

08:30 AM రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల 6వ రౌండ్ ఫలితాలలో ముందంజలో వాణీ దేవి ఉన్నారు. మొత్తం గా సురభి వాణీ దేవి 7,626 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

★ సురభివాణీ దేవి – 1,05,710

★ రామచంద్రరావు – 98,084

★ నాగేశ్వర్ – 50,450

★ చిన్నారెడ్డి – 50,450

06 :00 AM ఉమ్మడి నల్గొండ,వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగిసిన చివరిదైనా 7వ రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. 7వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ. ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ.

పూర్తి అయిన మొదటి ప్రాదన్యత ఓట్ల లెక్కింపు. తేలని ఫలితం. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కి సన్నాహాలు.

● పల్లా రాజేశ్వర్ రెడ్డి – 110,840

● తీన్మార్ మల్లన్న – 83,290

● కొదండరాం – 70,072

● ప్రమేందర్ రెడ్డి – 39,107

04:30 AM రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల 5వ రౌండ్ ఫలితాలలో ముందంజలో వాణీ దేవి ఉన్నారు. మొత్తం గా సురభి వాణీ దేవి 6,555 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

★ సురభివాణీ దేవి – 88,304

★ రామచంద్రరావు – 81,749

★ నాగేశ్వర్ – 42,604

★ చిన్నారెడ్డి – 24,440

01 :00 AM ఉమ్మడి నల్గొండ,వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగిసిన 6వ రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. 6వ రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ. ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 22,843 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ.

● పల్లా రాజేశ్వర్ రెడ్డి – 95,317

● తీన్మార్ మల్లన్న – 72,474

● కొదండరాం – 59,705

● ప్రమేందర్ రెడ్డి – 34,228

12:30 AM రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నాలుగో రౌండ్ ఫలితాలలో ముందంజలో రామచంద్రరావు ఉన్నారు. అయినప్పటికీ టీఆరెస్భ్యర్థి సురభి వాణీ దేవి 5553 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు

★ సురభివాణీ దేవి – 70,552

★ రామచంద్రరావు – 64,999

★ నాగేశ్వర్ – 34,029

★ చిన్నారెడ్డి – 20,053

08 :30 PM ఉమ్మడి నల్గొండ,వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగిసిన ఐదవ రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. ఐదవ రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ. ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 18,606 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ.

● పల్లా రాజేశ్వర్ రెడ్డి – 79,111

● తీన్మార్ మల్లన్న – 60,505

● కొదండరాం – 49,091

8:00 PM రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మూడవ రౌండ్ ఫలితాలలోను ముందంజలో టీఆరెస్ అభ్యర్థి సురభి వాణీ దేవి 5841 ఓట్ల ఆధిక్యంలో ఉంది

★ సురభివాణీ దేవి – 48,323

★ రామచంద్రరావు – 42,482

★ నాగేశ్వర్ – 22,355

04 :30 PM ఉమ్మడి నల్గొండ,వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగిసిన నాలుగో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు. నాల్గవ రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ. ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 16,182ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ.

● పల్లా రాజేశ్వర్ రెడ్డి – 64,546

● తీన్మార్ మల్లన్న – 48,364

● కొదండరాం – 41,477

12:40 PM రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండవ రౌండ్ ఫలితాలలోను ముందంజలో టీఆరెస్ అభ్యర్థి సురభి వాణీ దేవి 2613 ఓట్ల ఆధిక్యంలో ఉంది

★ సురభివాణీ దేవి – 35,171

★ రామచంద్రరావు – 32,558

★ నాగేశ్వర్ – 16,951

★ చిన్నారెడ్డి – 10,062

12 :00 PM ఉమ్మడి నల్గొండ,వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ కౌంటింగ్ ముగిసిన మూడో రౌండ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు.మూడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందంజ. ఇప్పటివరకు సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 12,142 ఓట్ల ఆధిక్యంతో పల్లా ముందంజ.

మూడో రౌండ్ లో పల్లాకు పడ్డ ఓట్లు..17393…

తీన్మార్ మల్లన్నకు….13,122

కోదండరాంకు 11,907….

8.00 AM :: రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఫలితాలు

TRS – 17429

BJP – 16385

Nageswr – 8357

8 : 00 AM ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో రౌండ్ ఫలితాలు వెలువడిన పిమ్మట 7871 ఓట్ల ఆధిక్యం లో పల్లా రాజేశ్వర్ రెడ్డి.

పల్లా రాజేశ్వర్ రెడ్డి – 31,987

తీన్మార్ మల్లన్న – 24,116

కొదండరాం – 18,528

ప్రేమెందర్ – 13,284

3:00 AM ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఫలితాలు. .దాదాపు 4 వేల ఓట్ల ఆధిక్యం లో పల్లా రాజేశ్వర్ రెడ్డి.

పల్లా రాజేశ్వర్ రెడ్డి – 16,130

తీన్మార్ మల్లన్న – 12046

కొదండరాం – 9086

ప్రేమెందర్ – 6615

3.00 AM :: రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ కౌంటింగ్ లో టీఆరెస్ బీజేపీ మద్య హోరాహోరీగా ఉన్నట్లు సమాచారం. ఇక్కడ కొద్దిసేపటిలో మొదటి రౌండ్ ఫలితాలు వెలువడనున్నాయి.

9: 00 PM :: రంగారెడ్డి – మహాబూబ్ నగర్ – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. బండిల్స్ కట్టే ప్రక్రియ రాత్రి10 వరకు పట్టనున్నట్లు సమాచారం. 10 తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభమయ్యో అవకాశం

8:30 PM :: ఖమ్మం – నల్గొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తైనట్లు సమాచారం. 56 వేల ఓట్లలో చెల్లనవి 3151 ఓట్లు… చెల్లిన ఓట్లలో టీఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డికి 16000 మొదటి ప్రాధాన్యత ఓట్లు పడినట్లు సమాచారం. మొత్తంగా 7 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో 2100 ఓట్లకు గాను
TRS అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి 1300 ఓట్లు పడ్టట్లు సమాచారం…

మొదటి రౌండ్ లో సగానికి పైన ఓట్ల తో ఆధిక్యంలో ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి… రెండవ స్థానం లో కోదండరాం,మూడవ స్థానం లో తీన్మార్ మల్లన్న, నాల్గవ స్థానంలో రాములు నాయక్ ఉన్నట్లు సమాచారం. అధికారికంగా ఫలితాలు ప్రకటించాల్సి ఉంది.