తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండోసారి ఘన విజయం

నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి, రైతు బంధు సమితి అధ్యక్షుడు, పల్లా రాజేశ్వర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన (నవీన్) మీద రెండవ ప్రాధాన్యత ఓటు ద్వారా విజయం సాధించారు. దీనితో పల్లా వరుసగా రెండోసారి ఎమ్మెల్సీగా గెలిచినట్లయింది. తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకున్న టీఆరెస్.

విజయానికి సంబంధించిన అధికారిక ప్రకటన కాసేపట్లో ఎన్నికల కమిషన్ చేయనుంది.