కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాల నుండి టీడీఎస్ కట్ చేయవద్దు – కమీషనర్ తో ఎమ్మెల్సీ అలుగుబెల్లి.

కాంట్రాక్ట్ అధ్యాపకులకు టీడిఎస్ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ఆదాయపన్ను పరిధిలోకి రాని కాంట్రాక్టు అధ్యాపకుల/ పార్ట్ టైమ్ జేఎల్స్ / పార్ట్ టైమ్ ల్యాబ్ అటెండర్స్ వేతనాల నుండి టీడీఎస్ రూపంలో వేతనాలు కట్ చేయవద్దని ఇంటర్ విద్య కమిషనర్ కు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

శనివారం హైదరాబాద్ లోని ఇంటర్ విద్యా కమిషనరేట్ లో ఇంటర్మీడియట్ కమిషనర్ ను ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరియు 475 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్, వస్కుల శ్రీనివాస్, శోభన్ తో కలిసి కమిషనర్ కు టీడీఎస్ విషయంపై విజ్ఞప్తి చేశారు.

టీడీఎస్ కు సంబంధించిన ఆదాయపన్ను శాఖ కమిషనర్ ను కలిసిన నేపథ్యంలో డి డి ఓ లు ప్రతి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎవరైతే ట్యాక్స్ పరిధిలోకి రాని ఉద్యోగులు ఉంటారో వారి నుండి 15G ఫామ్ తీసుకొని ఆదాయపు పన్ను శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రక్రియ కాంట్రాక్టు/పార్ట్ టైమ్ ఉద్యోగుల విషయంలో జరపకపోవడంతో డి డి వో లకు నోటీసులు ఇచ్చినట్లు సంబంధిత టిడిఎస్ కమిషనర్ తెలిపినట్లు అలుగుబెల్లి వివరించారు. అలాగే ప్రతి సంవత్సరం పామ్ 16 ను కాంట్రాక్టు/పార్ట్ టైం అధ్యాపకులు సమర్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వివరించారు.

ఈ సందర్భంగా ఇంటర్ విద్య కమిషనర్ కు విజ్ఞప్తి చేస్తూ డిడీవో లకు ఆదాయ పన్ను శాఖ సంబంధించిన నిబంధనలు అమలు చేయవలసిందిగా తెలియజేస్తూ కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు నుండి టీడీఎస్ రూపంలో కట్ చేయవద్దని సూచనలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

దీని మీద ఇంటర్ విద్య కమిషనర్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో ఈ విషయం మీద స్పష్టత ఇస్తానని హామీ ఇచ్చారని కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.