తెలంగాణ బడ్జెట్ – 2021లో 4 వేల కోట్లతో సరికొత్త విద్యాపథకాన్ని ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. పాఠశాలలకు అవసరమైన భవనాలు, వాటి మరమ్మతులు, టాయిలెట్లు, కావాల్సిన ఫర్నీచర్ వంటి వసతులు కల్పించాలని నిర్ణయించిందని మంత్రి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా తీర్చిదిద్దేంకూ వచ్చే రెండు సంవత్సరాలలో రాష్ర్టంలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
విద్యా రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో పాఠశాల తరగతులను అనుసంధానం చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ బృహత్తర విద్యాపథకం కోసం ఈ ఏడాది రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.