తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు అయినా నైతికత మానవ విలువలు మరియు పర్యావరణ విద్య అనే అంశాలపై బోర్డు పరీక్షలు ఏప్రిల్ 1 మరియు ఎప్రిల్ 3వ తేదీలలో జరగనున్నాయి.
ఈ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన ఇప్పటికీ రిజల్ట్ విత్ హెల్డ్ లో ఉంటుంది. కావున విద్యార్థులు తప్పనిసరిగా ఈ బోర్డు పరీక్షలు అయినా నైతికత మానవ విలువలు మరియు పర్యావరణ విద్య పరీక్షలను తప్పనిసరిగా హాజరై ఉత్తీర్ణత సాధించవలసి ఉంటుంది.
ఈ అంశాలకు సంబంధించి వ్యక్తిగత మరియు గ్రూప్ ప్రాజెక్టు వర్క్ లను విద్యార్థులు పూర్తి చేయావలసి ఉంటుంది. ఈ ప్రాజెక్టు వర్క్ కు 40 మార్కులు మరియు పరీక్షకు 60 మార్కులు మొత్తంగా 100 మార్కులు ఉంటాయి.
ఈ నైతికత మానవ విలువలు మరియు పర్యావరణ విద్య కు సంబంధించిన మెటిరీయల్ కింద లింక్ లో ఇవ్వబడినది.