స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) నియామక ప్రక్రియకు సంబంధించిన తుది ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.sbi.co.in లో అందుబాటులో ఉంచింది.
దేశవ్యాప్తంగా వివిధ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న 2000 పీఓ పోస్టుల భర్తీకి ఎస్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించింది. వీటిలో అర్హత సాధించిన 2003 మంది అభ్యర్థులను ఎంపికచేసింది. వీరి నియామకాలకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ కాపీలను విడుదల చేసింది.
వెబ్సైట్ :: www.sbi.co.in