పరీక్షలు లేకుండానే 1 నుండి 8 తరగతుల విద్యార్థుల ప్రమోషన్

2020-21 విద్యా సంవత్సరానికిగాను పరీక్షలు లేకుండానే 1 నుండి 8 తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్‌ చేస్తూ ఒడిశా స్కూల్‌ అండ్‌ మాస్‌ ఎడ్యూకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ బుధవారం నిర్ణయం తీసుకుంది.

కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో పాఠశాలలు బంద్‌ చేస్తున్న కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలకు ఇది వర్తించనుంది. ఒడిశాలో 10, 12వ తరగతులు జనవరి 12 నుంచి అదేవిధంగా కాలేజీలు, యూనివర్సిటీలు జనవరి 11 నుండి తిరిగి తెరుచుకున్నాయి.