మోడల్ స్కూల్ లలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను పెంచండి – PMTA TS

కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2021 కి పరీక్ష సెంటర్ లను పెంచుతున్న నేపథ్యంలో అన్ని మోడల్ స్కూల్స్ మరియు జూనియర్ కళాశాలలకు పరీక్ష కేంద్రాలను ఇవ్వాలని అలాగే మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ల్లో సెల్ప్ సెంటర్ ల సంఖ్య పెంచాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ను PMTA – TS సంఘం తరపున తరాల జగదీష్ కోరారు.

దీని వలన విద్యార్థులకు కరోనా కారణంగా కలిగే అసౌకర్యాన్ని తగ్గించవచ్చని, కరోనా భారీ నుండి విద్యార్థులను రక్షించవచ్చని తెలిపారు. దీనిపై కమీషనర్ సానుకూలంగా స్పందించారని తరాల జగదీష్ తెలిపారు.

● మోడల్ స్కూల్ టీచర్లకు పరీక్ష విధులు కేటాయించండి

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2021 సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ లలో పని చేస్తున్న టీచర్లకు CS, DO, CUSTODIANవంటి విధులను ఎక్కువగా కేటాయించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ను PMTA TS సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్ కోరారు. దీనిపై కార్యదర్శి ఉమర్ జలీల్ సానుకూలంగా స్పందించారని జగదీష్ ఒక ప్రకటనలో తెలిపారు