మోడల్ స్కూల్స్ నూతన డైరెక్టర్ ఉషారాణికి శుభాకాంక్షలు – తరాల జగదీష్

తెలంగాణ రాష్ట్రం లోని మోడల్ స్కూల్స్ కు నూతన డైరెక్టర్ గా నియమితులైన ఉషారాణిని, జాయింట్ డైరెక్టర్ సరోజినీ దేవిని PMTA TS రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, ప్రధాన కార్యదర్శి అనుముల పోచయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు లావణ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కెనపల్లి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులు మరియు అవర్లీ బేసిస్ టీచర్స్ కలసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

మోడల్ స్కూల్ టీచర్ల డిఫర్మెంట్, డిఏ బకాయిలు కూడా రెండు రోజుల్లో క్రెడిట్ అవుతాయని అదేవిధంగా నూతన డిఏ బకాయిలు కూడా క్రెడిట్ అవుతాయని తరాల జగదీష్ తెలిపారు.

తెలంగాణ పరీక్ష నియంత్రణ విభాగం డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డికి శుభాకాంక్షలు

మోడల్ స్కూల్స్ పునాది నుండి నేటి వరకు సుమారు 8 సంవత్సరములు సుదీర్ఘంగా మోడల్ స్కూల్స్ డైరెక్టర్ గా పనిచేసి మోడల్ స్కూల్ ల అభ్యున్నతి కి తోడ్పడి నేడు తెలంగాణ పరీక్ష నియంత్రణ విభాగం డైరెక్టర్ గా పూర్తి స్థాయి అధికారిక భాద్యతలు చేపట్టిన సత్యనారాయణ రెడ్డికి PMTA TS సంఘం తరుపున తరాల జగదీష్ నేతృత్వంలో శుభాకాంక్షలు తెలుపుతూ శాలువతో సత్కరించిడం జరిగింది.