విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత ఏ రంగంలో రాణిస్తారో తెలుసుకునేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు క్యాంపస్ క్రాప్ అనే సంస్థతో కలిసి కెరీర్ కౌన్సెలింగ్ అనే కార్యక్రమం నిర్వహించనుంది.
ఈ కార్యక్రమాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదివే ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు ఈ కెరీర్ కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల లో చదివే విద్యార్థులకు ఈ కౌన్సెలింగ్ ను ఉచితంగా అదించనున్నారు
దీని కోసం సంబంధించిన కళాశాలలు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తర్వాత కళాశాలల ద్వారా విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
షెడ్యూల్ ::
రిజిస్ట్రేషన్ :: 15 -03- 2021 నుంచి 21 – 03 – 2021
అసెస్మెంట్ :: 22 -03- 2021 నుంచి 31 – 03 – 2021
రిపోర్ట్ :: 06 – 04 -2021
క్యాంపస్ క్రాప్ ప్రతినిధి ఆచార్య ఆర్యశ్రీ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనాలంటే ఆన్లైన్లో పరీక్ష రాయాల్సి ఉంటుందన్నారు. నిపుణుల ద్వారా కౌన్సెలింగ్‌కు మాత్రం కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం రిజిస్ట్రేషన్ కోసం కింది వెబ్సైట్ ను సందర్శించాలి.
వెబ్సైట్ :: http://www.tsbie.campuscrop.in