అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కు వినియోగించుకోవాలి – మబ్బు పరశురాం

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న శాసనమండలి వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియెజకవర్గం ఎన్నిక సందర్భంగా జనగాం జిల్లా లింగాల ఘణపురం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మాదిగ ఆలోచన వేదిక వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు మబ్బు పరశురాం మాదిగ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డా॥బాబా సాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోని వయోజనులందరికి కుల,మత,లింగ మరియు వర్గం బేధం లేకుండ అమూల్య మైన ఓటు హక్కును కల్పించారని, అందరు తమ బాధ్యతగా వినియోగించుకోవాలని, సమస్యలను పరిష్కరించే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకోవాలని కోరడం జరిగింది .