మనకు అండగా ఉన్న ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి – కనకచంద్రం, కడారి శ్రీనివాస్

హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ మిత్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హరీష్ రావు నాయకత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీమతి పివి వాణిని అత్యధిక మెజార్టీతో గెలిపించి హరీష్ రావు కి గిఫ్ట్ గా ఇవ్వాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి అని 711 సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ప్రభుత్వము రాగానే కాంట్రాక్టు అధ్యాపకుల రెగ్యులరైజ్ కోసం జీవో నెంబర్ 16 ఇవ్వడం జరిగింది. నాన్ సాంక్షన్ పోస్టులను సాంక్షన్ చేయడం జరిగింది. వేతనం 18 వేల నుండి 37,100 పెంచడం జరిగింది. 20 సంవత్సరాల నుండి 8, 10 నెలల వేతనం పొందుతున్న కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకులకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 నెలల వేతనం వచ్చింది. త్వరలో పీఆర్సీ కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా అమలవుతది, అలాగే ఈ నెలనెలా వేతనాలు వస్తాయి. బదిలీల పై స్వయంగా ముఖ్యమంత్రి స్పందించి ప్రకటన విడుదల చేశారు.

కావునా కాంట్రాక్టు జూనియర్ అధ్యాపకుల ప్రయోజనాలు గురించి ఆలోచించే వారికి మాత్రమే ఓటు వెయ్యాలి ప్రశ్నించే వారికి వేస్తే ప్రశ్నగానే మారుతుంది. కరోనా సమయంలో కాంట్రాక్ట్ లెక్చరర్ కి రెన్యువల్ జీవో వస్తుందా లేదా అని అయోమయంలో ఉన్నాము. ఇలాంటి కష్టకాలంలో కూడా మనకు జీతాలు ఇస్తూ మనకు అండగా నిలిచింది ప్రభుత్వం. ఇలాంటి సమయంలోనే మన ప్రభుత్వానికి అండగా ఉండాలి మనకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని 711 సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి శ్రీనివాస్ మహబూబ్ నగర్ అధ్యక్షులు అరవింద్, నారాయణ్ పేట్ అధ్యక్షులు రాఘవేంద్రరావు, నాగర్ కర్నూల్ అధ్యక్షులు వెంకటేశర్ రావు, గద్వాల అధ్యక్షులు పవన్ కుమార్, హైదరాబాద్ అధ్యక్షురాలు మాలతి తదితరులు పాల్గొన్నారు