ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు – ఇంటర్విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి

  • ఈ నెల 19, 20న అసెంబ్లీ సాక్షిగా పీఆర్సీ ప్రకటించే అవకాశం
  • ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి కృత్ఞతలు తెలిపిన ఇంటర్ విద్య జేఏసీ ఛైర్మన్ Dr. మధుసూదన్ రెడ్డి

ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాలు ప్రకటించడంపై… ఉద్యోగ సంఘాలు హైదరాబాద్ లో సంబరాలు జరుపుకున్నారు
పీఆర్సీ అమలు పైన, ఉద్యోగుల వయోపరిమితి పైన , మరియు కాంట్రాక్టు ఉద్యోగులకు PRC అమలు పై నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ… నాంపల్లిలోని విద్యా భవన్ ఆచార్య జయశంకర్ విగ్రహం ముందు ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి… టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఈ నెల 19, 20న అసెంబ్లీ సాక్షిగా మంచి పీఆర్సీ ప్రకటిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై ఇంటర్ విద్యార్థి ఐకాస చైర్మన్ మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కరోనా ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితి కుదేలైన నేపథ్యంలో… ముఖ్యమంత్రి ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయారని తెలిపారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాద్యాయుల నిరాశను అర్థం చేసుకొని మంచి పీఆర్సీ తీసుకుంటానని… ఉద్యోగుల వయోపరిమితి పైన స్పష్టమైన వైఖరి ప్రకటించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి పై అనేకమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని… వాటి అన్నింటికీ తెర తీస్తూ ఉద్యోగుల కుటుంబ సభ్యున్ని, పక్షపతి అని మరోసారి నిరూపించుకున్నారని… ముఖ్యమంత్రికి ఉద్యోగ సంఘాలు కృతజ్ఞతతో ఉంటామని మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.