ఈ రోజు సీఎంతో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యారు… అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. పీఆర్సీ, ఉద్యోగుల పదోన్నతులు, సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ స్కీమ్ అమలు, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, ఏపీలో ఉన్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడం వంటి విషయాలకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు సీఎం చెప్పారని ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.
ఎన్నికల నియమావళి ఉండటంతో ప్రకటన చేయలేకపోతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పీఆర్సీ ప్రకటన వస్తుందన్నారు. 2014 తర్వాత దేశంలోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ అత్యధిక పీఆర్సీ ఇచ్చినట్లు తెలిపారు. ఏపీలో ఇస్తున్న 27% ఐఆర్ కంటే ఎక్కువ పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.