కాంట్రాక్టు మహిళా అధ్యాపకురాళ్ళకు కూడా ప్రత్యేక సెలవు

ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులందరికీ సోమవారం ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించింది. అయితే ఎక్కడా కూడా కేవలం రెగ్యులర్ మహిళ ఉద్యోగులకు మాత్రమే ఈ సెలవు దినం అని ప్రకటించకపోవడంతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు ఇతర తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ కూడా ఈ సెలవు దినం వర్తిస్తుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ కమీషనరేట్ ప్రభుత్వం ప్రత్యేక సెలవు దినం పై సీఎస్ సోమేశ్ కుమార్ విడుదల చేసిన ఉత్తర్వులను కోట్ చేస్తూ ఇంటర్మీడియట్ వ్యవస్థ లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సెలవు దినము జారీ చేస్తూ మెమో జారీ చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలో 711 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకచంద్రం, 475 రాష్ట్ర అధ్యక్షుడు కొప్పిశెట్టి సురేష్, 508 సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న మాట్లాడుతూ మహిళా జూనియర్ అధ్యాపకురాళ్ళకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రత్యేక సెలవు దినం కేవలం రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే అని ప్రభుత్వం గానీ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఉత్తర్వులలో లేకపోవడంతో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులు అందరికీ ఈ సెలవు దినం వర్తిస్తుందని తెలిపారు.