14వ సీజన్ ఇండియన్ ప్రిమియర్ (IPL) షెడ్యూల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం విడుదల చేసింది. దేశంలోని ఆరు వేదికల్లో… అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా ఈ సారి జరగనుంది.
14వ సీజన్ ఏప్రిల్ 9న చెన్నైలో జరిగే తొలి మ్యాచ్‌తో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తలపడనున్నాయి. ఇక ఫైనల్ మే 30న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్లేఆఫ్ మ్యాచ్‌లు కూడా ఇదే స్టేడియంలో జరగనున్నాయి.
మొత్తం 56 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సీజన్ ప్రత్యేకత అన్ని టీమ్స్ తటస్థ వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఏ టీమ్ కూడా సొంత గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోవడం లేదు. మ్యాచ్ సమయం మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.