క్రికెట్ చరిత్రలోమొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్న “వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్” ఫైనల్ కు టీమిండియా చేరింది. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగనున్న పైనల్ లో న్యూజిలాండ్‌తో ఇండియా తలపడనున్నది.
టెస్ట్ క్రికెట్ పాయింట్ల పట్టికలో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఇండియా 3-1 తేడాతో 4 మ్యాచ్ ల సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. 560 పాయింట్లతో టెస్ట్ చాంపియన్‌షిప్ టేబుల్లో టాప్‌లో నిలిచింది.
మొత్తం ఆరు సిరీస్‌లు ఆడిన ఇండియా.. 12 మ్యాచ్‌లను గెలవగా.. నాలుగింట్లో ఓడింది. ఇక న్యూజిలాండ్ 420 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నది. 5 సిరీస్‌లు ఆడిన న్యూజిలాండ్ ఏడు టెస్టుల్లో గెలవగా.. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.