రేపట్నుంచి 6, 7, 8 తరగతులు ప్రారంభం

పిబ్రవరి 24వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రం లోని 6, 7, 8 తరగతులు ప్రారంభించుకోవచ్చని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈనిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. కొవిడ్‌ మార్గదర్శకాలు పాటిస్తూ రేపటి నుంచి మార్చి ఒకటో తేదీ లోపు ఎప్పుడైనా తరగతులు ప్రారంభించుకోవచ్చు అని పాఠశాలలకు సూచించారు.

అయితే పిల్లలు పాఠశాలలకు వచ్చేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అని మంత్రి పేర్కొన్నారు.