ఇంటర్ విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు కార్యక్రమం.

పిబ్రవరి 21 మరియు 28వ తేదీలలో ఇంటర్మీడియట్ బోర్డు మరియు హర్ట్ పుల్ నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ల ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జీవన నైపుణ్యాలను పెంపోందిస్తూ, పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించేందుకు HELP (HEARTFULLNESS EXPERIENCE LIFE’S POTENTIAL) అనే స్వంచ్ఛంద కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నారు.

యూట్యూబ్ చానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని లైవ్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఇంటర్మీడియట్ కళాశాలల విద్యార్థులు మరియు అధ్యాపకులు వీక్షించేందుకు యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు వర్గాలు వెల్లడించాయి.

పిబ్రవరి 21వ మరియు 28 వ తేదీలలో ఆదివారం నాడు ఉదయం 11.00 గంటల నుండి 12.30 నిమిషాలు వరకు రెండు సెషన్ లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కార్యక్రమం యొక్క యూట్యూబ్ లింక్ ::

https://www.youtube.com/c/HeartfulnessEducation/live