గాదె లింగస్వామి తండ్రికి నివాళులు అర్పించిన పలువురు స్వెరోస్ సంఘాల నాయకులు

తిప్పర్తి గురుకుల ప్రిన్సిపాల్ గాదె లింగస్వామి తండ్రి గాదె రాములు గత శుక్రవారం అకాలమరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ పలు స్వెరోస్ మరియు స్వెరోస్ అనుబంధ సంఘాల నాయకులు ఈ రోజు శివనేనిగూడెంలో గాదె లింగస్వామి మరియు వారి కుటుంబ సభ్యులను ఓదార్చి , పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో జైభీం యూత్ ఇండియా జాతీయ అధ్యక్షుడు , TGPA వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి, స్వెరోస్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ యాదాద్రి జోన్ అధ్యక్షులు ఎర్ర నర్సింహ్మ, స్వెరోస్ సెంట్రల్ కమిటీ మెంబర్ రాజేష్ కిరణ్ , టాస్క్ పోర్స్ అడిషనల్ ఎస్పీ సతీష్ , స్వేరోస్ ఎంప్లాయిస్ అసోషియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ రాధా, స్వెరోస్ సర్కిల్ రాష్ట్ర నాయకులు ఆదిమల్ల వెంకటేష్, నల్గొండ జిల్లా అధ్యక్షుడు రామవత్ రమేష్ నాయక్, జిల్లా నాయకులు మేడి అశోక్, కృష్ణ యాదాద్రి జిల్లా నాయకులు మహేందర్, రాందాస్ తదితరులు హాజరయ్యారు.