భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) ఫిబ్రవరి 28న PSLV – C – 51 రాకెట్ ప్రయోగం శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి నిర్వహించనుంది.
పీఎస్ఎల్వీ సీ-51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపనున్నారు.
స్పేస్ కిడ్జ్ సంస్థ రూపొందించిన సతీష్‌ధావన్ ప్రైవేటు శాటిలైట్‌లో ప్రధాని మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్ మిషన్’ పదాలు, భగవద్గీత పుస్తకం, 25 వేల మంది పౌరుల పేర్లు కలిగి ఉన్న జాబితా ను అంతరిక్షంలో పంపనున్నారు.