కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు

CREDITS :: NTNEWS

వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సిం గ్‌ సిబ్బందికి రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు గౌరవప్రదంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరికోసం మొదటి వేతన సంఘం చేసిన సిఫారసులను ప్రభుత్వం పరిశీలిస్తున్నది.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ నేతృత్వం లో ఏర్పాటైన త్రిసభ్య కమిటీ దీనిపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. వేతనాలతోపాటు రెగ్యులర్‌ ఉద్యోగులకు ఉండే సదుపాయాల కల్పనపై కూడా దృష్టిపెట్టినట్టు తెలిసింది. తొలి పీఆర్సీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులకు ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, ఇంక్రిమెంట్లు, పదోన్నతులు, మేలైన సౌకర్యాలు.. వేతనాల మధ్య అంతరాన్ని తగ్గించడం వంటి అనేక సూచనలను చేసింది.

పీఆర్సీ ప్రతిపాదనలు

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు, జిల్లా ల్లో లక్ష మంది కాంట్రాక్ట్‌ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది వివిధ స్థాయిలల్లో పనిచేస్తున్నారు. ఈ సంఖ్య చిన్నదేమి కాదు…రెగ్యులర్‌ ప్రాతిపదికన నియామకం కాకపోయినా అనేక ఏండ్లుగా వీరు ఆయా విభాగాల్లో అతి కొద్దివేతనాలతో పనిచేస్తున్నారు. వీరికి హెల్త్‌కార్డులు లేవు, సెలవులు ఉండవు, ఇంక్రిమెంట్లు ఉండవు.. వీటిని క్షణ్ణంగా పరిశీలించిన పీఆర్సీ, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి మెరుగైన జీతం, రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా వసతులు కల్పించడంపై సిఫారసులుచేసింది.

 • గ్రూప్‌ 3, గ్రూప్‌-4ల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడినప్పుడు కాంట్రా క్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌లలో పనిచేస్తున్న సిబ్బంది పరీక్షలు రాయడానికి వయసు సడలింపు 40 ఏండ్ల వరకు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలి.
 • రెగ్యులర్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా లెక్చరర్‌ పోస్టులను భర్తీ చేయాలి. నియామకం జరిగిప్పుడు జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ జూనియర్‌ లెక్చరర్లు, లెక్చరర్లకు తగిన వెయిటేజీ ఇవ్వవచ్చు.
 • కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వారి పనిని బట్టి 8 ఏండ్ల సర్వీసును తీసుకొని పదోన్నతులు ఇవ్వవచ్చు.
 • జూనియర్‌ అసిస్టెంట్‌ సమాన క్యాడర్‌లో ఉన్నవాళ్లను, సీనియర్‌ అసిస్టెంట్‌ సమాన క్యాడర్‌.. సీనియర్‌ అసిస్టెంట్‌ సమాన క్యాడ ర్‌ ఉన్నవాళ్లను, సూపరింటెండెంట్‌ సమాన క్యాడర్‌కు పదోన్నతి కల్పించవచ్చు. వారి వేతనాల్లో పెరుగుదల ఉంటుంది. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మధ్య వేతనాల అసమానతలను తగ్గించవచ్చు. ఉద్యోగులు తమకు కూడ వేతనాలు పెరుగుతాయని, ప్రభుత్వాలు తమను మంచిగా చూసుకుంటాయనే నమ్మకం కలుగుతుంది.
 • కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఏటా రూ.1000 ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి.
 • కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇచ్చే విధంగానే సదుపాయాలు కల్పించాలి. ఒక్క పెన్షన్‌ మినహా మిగిలిన అన్ని రకాల సదుపాయలు రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇచ్చిన విధంగానే వీరికి కల్పించడం వల్ల ఒత్తిడి ఉండదు. మానవ వనరులు సద్వినియోగమవుతాయి.
 • కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సాధారణ సెలవు, 120 ప్రసూతి సెలవులు (వేతనం లేకుండా), అన్ని ప్రభుత్వ సెలవులు, ఈఎస్‌ఐ సౌకర్యం, కంట్రిబ్యూషన్‌
 • పెంపు ప్రతిపాదనలు
 • గ్రూప్‌ -4 కింద ఉన్న ఆఫీస్‌ సబార్డినేట్‌, వాచ్‌మె న్‌, మాలి, కామాటి, కుక్‌, సైకిల్‌ ఆర్డర్లీ, చౌకీదార్‌, ల్యాబ్‌ అటెండర్‌, దఫేదార్‌, జమేదార్‌, జిరాక్స్‌ ఆపరేటర్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, క్యాషియర్‌, లిఫ్ట్‌ ఆపరేటర్‌ క్యాటగిరీ పోస్టులకు రూ.12 వేల వేతనాన్ని 19 వేలకు పెంచాలి.
 • గ్రూప్‌-3 కింద ఉన్న డ్రైవర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ స్టెనో, టైపిస్ట్‌, టెలిఫోన్‌ ఆపరేటర్‌, స్టోర్‌ కీపర్‌, ఫొటోగ్రాఫర్‌, ఎలక్ట్రీషియన్‌, మెకానిక్‌, ఫిట్టర్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, సినిమా, ఫిల్మ్‌, ఆడియో విజువల్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ క్యాటగిరీ పోస్టులకు రూ.15 వేల వేతనాన్ని, రూ.22,900 కు పెంచాలి.
 • గ్రూప్‌-3 (ఏ) కింద ఉన్న సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ స్టెనో, సీనియర్‌ అకౌంటెంట్‌, ట్రాన్స్‌లేటర్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, డీపీవోలకు 17,500 ఉన్న వేతనాన్ని రూ.31,040 కి పెంచాలి.
 • ఇంటర్‌, జూనియర్‌ లెక్చరర్లకు రూ.37,100 ఉన్న వేతనాన్ని 54,220, పాలిటెక్నిక్‌, డిగ్రీ లెక్చరర్లకు రూ.40,270లనుంచి రూ.58,850 కు పెంచాలి.
 • పార్ట్‌ టైమ్‌ లెక్చరర్లు, గెస్ట్‌ లెక్చరర్లకు ప్రస్తుతం గంటకు రూ.300 నెలకు రూ.21,600 ఉన్న వేతనాన్ని గంటకు రూ.400.. నెలకు రూ.28,800 కు పెంచాలి.
 • మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ పార్ట్‌టైమ్‌ లెక్చరర్లకు ప్రస్తుతం రూ.37,100 ప్లస్‌ డీఏ ఇస్తున్నారు. దీనిని రూ.54,220 ప్లస్‌ డీఏ గా ఇవ్వాలి.

CREDITS :: NTNEWS