విద్యా వాలంటీర్ల నియామాకానికి గ్రీన్ సిగ్నల్.

తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల లోకి 2021- 22 విద్యా సంవత్సరానికిగాను విద్యావలంటీర్లను నియమించుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

నెలకు 12 వేల వేతనంతో విద్యావలంటీర్లను 2021 – 22 విద్యా సంవత్సరానికి గాను నియమించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు సక్రమంగా నడవడానికి, విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది అందుబాటులో ఉండటం కొరకు ఈ విద్యా వాలంటీర్లు నియామాకానికి అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు.