ఇంటర్ విద్యార్థులకు ఒక రోజు ఆఫ్‌లైన్, తర్వాతి రోజు ఆన్లైన్లో తరగతులు నిర్వహించేందుకు షెడ్యూల్‌ను ఖరారుచేస్తూ ఇంటర్‌బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ నెల 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే భౌతిక తరగతులు ఒక రోజు ఫస్టియర్, మరోరోజు సెకండియర్‌కు నిర్వహిస్తున్నారు.
50శాతానికి పైగా విద్యార్థులు ఈ ప్రత్యక్ష తరగతులకు హాజరవుతున్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులకు ఇష్టమైతేనే భౌతిక తరగతులకు హాజరుకావొచ్చని పేర్కొన్న ఇంటర్‌బోర్డు, ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండు రకాల బోధనలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఫస్టియర్ :: సోమ, బుధ, శుక్రవారాల్లో ప్రత్యక్ష తరగతులు జరుగనుండగా, మంగళ, గురు, శనివారాల్లో ఆన్లైన్ క్లాసులు ఉంటాయి.
సెకండియర్ :: మంగళ, గురు, శనివారాల్లో ప్రత్యక్ష తరగతులు జరుగనుండగా, సోమ, బుధ, శుక్రవారాల్లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నారు