నెలనెలా వేతనానికై హరీష్ రావుకి వినతి

తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత మరియు నెలనెలా వేతనాలు కల్పించాలని ఈ రోజు మెదక్ లో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుని TGDCLA-900 సంఘం రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు హమీ ఇస్తూ అతి త్వరలోనే నెలనెలా వేతనం చెల్లింపునకు చర్యలు చేపడతామని, భద్రతా విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ఉందని పేర్కొన్నారని వినోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్ ల సంఘం రాష్ట్ర నాయకులు అరుణ కుమారి, వినయ్ కుమార్, రాజగౌడ్ లు పాల్గొన్నారు