డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ పీజీ తరగతులను ఫిబ్రవరి 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు.
పీజీ అర్థశాస్త్రం, చరిత్ర, పొలిటికల్సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, కాంటాక్ట్-కమ్-కౌన్సిలింగ్ తరగతులను పీజీ కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. కోర్సుల వారీగా తరగతులు నిర్వహించే సమయం తదితర వివరాలకు పీజీ అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.
వెబ్సైట్ :: www.braouonline.in