వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి ఈ రోజు ప్రకటించింది.

  • టీఎస్‌ ఎంసెట్‌ జూలై 5 నుంచి 9 వరకు.
  • పీజీఈసెట్‌ జూన్‌ 20న
  • ఈసెట్ జూలై 1న నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

అలాగే టీఎస్‌ ఎడ్‌సెట్‌, ఐసెట్‌, లాసెట్‌, పీజీలాసెట్‌, టీఎస్‌పీఈసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయించాల్సి ఉంది.

ఉన్నత విద్యామండలి మొత్తం 7 కోర్సుల్లో ప్రవేశానికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కీలకమైన ఎంసెట్‌ను జూలైలో నిర్వహించాలని నిర్ణయించింది.

  • ఎంసెట్‌, ఈసెట్‌ పరీక్షలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
  • ఐసెట్‌, పీజీఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌ పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సీటీకి అప్పగించారు.
  • టీఎస్‌ పీఈసెట్‌ నిర్వహణను ఈ ఏడాది కూడా మహాత్మాగాంధీ యూనివర్సిటీకే అప్పగించారు.

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ రెక్టార్‌ గోవర్ధన్‌, ఈసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ వెంకటరమణారెడ్డి వ్యవహరించనున్నారు. ఐసెట్‌ కన్వీనర్‌గా కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ రాజిరెడ్డిని నియమించారు.