పదవ తరగతి అర్హతతో 13,206 ఉద్యోగాలు

కేంద్ర యువజన, క్రీడా శాఖ పరిధిలో స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) 13,206 వలంటీర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

నేషనల్ యూత్ కార్ప్స్ స్కీమ్‌లో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరం కోసం పదో తరగతి అర్హతతో దేశవ్యాప్తంగా 13,206 వలంటీర్లను నియమిస్తున్నది.

వీరితో పాటు ప్రతీ కేంద్రంలో కంప్యూటర్, డాక్యుమెంటేషన్ పని కోసం ఇద్దరు వాలంటీర్లు ఉంటారు. ఎంపికైన అభ్యర్థులు ఏప్రిల్‌ 1న విధుల్లో చేరాలి.

● మొత్తం పోస్టుల సంఖ్య :: 13,206

● అర్హతలు :: పదవ తరగతి.

● వయో పరిమితి :: 2021 ఏప్రిల్ 1 నాటికి 18 నుంచి 29 ఏండ్లలోపు ఉండాలి.

● గౌరవ వేతనం :: రూ.5000/-

● ఎంపిక విధానం :: ఇంటర్వ్యూ ద్వారా

● దరఖాస్తు పద్దతి :: ఆన్లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

● చివరి తేదీ :: ఫిబ్రవరి 20

● ఇంటర్వ్యూలు :: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు

● ఇంటర్వ్యూ ఫలితాలు :: మార్చి 15

● వెబ్సైట్‌: https://nyks.nic.in/