ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో రెండు పట్టభద్రుల, ఏపీలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది.

తెలంగాణలో ఖమ్మం – వరంగల్‌-నల్గొండ మరియు మహబూబ్‌నగర్‌ – రంగారెడ్డి -హైదరాబాద్‌ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానుంది. మార్చి 14న పోలింగ్‌ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్‌.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఏపీలోని ఉపాధ్యాయ నియోజకవర్గాలైన ఈస్ట్‌గోదావరి-వెస్ట్‌గోదావరి, కృష్ణా-గుంటూరు ఎమ్మెల్సీలు రాముసూర్యరావు, ఏఎస్‌రామకృష్ణ పదవీకాలం సైతం పూర్తికానుంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

ఎన్నికల ప్రక్రియ

  • నోటిఫికేషన్‌ విడుదల :: ఫిబ్రవరి
  • నామినేషన్లకు చివరితేదీ :: ఫిబ్రవరి 23
  • నామినేషన్ల పరిశీలన :: ఫిబ్రవరి 24
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరితేదీ : : ఫిబ్రవరి 26
  • పోలింగ్ :‌: మార్చి 14 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు
  • ఓట్ల లెక్కింపు : : మార్చి 17