జీవో నంబర్ 16 పై రేపటి వాదనలకు కౌంటర్ కు సిద్ధం – కనక చంద్రం

కాంట్రాక్టు లెక్చరర్ ల క్రమబద్ధీకరణ కొరకు 2016లో విడుదలైన జీవో నంబర్ 16 పై హైకోర్టు నందు దాఖలైన పిల్ పై విచారణ రేపు హైకోర్టు బెంచ్ ముందుకు రానున్న నేపథ్యంలో కాంట్రాక్టు లెక్చరర్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం ఆధ్వర్యంలో ఫైనాన్స్ అధికారులను కలసి కోర్ట్ కేస్ సంబంధించినటువంటి కౌంటర్ ఫైల్ పూర్తి చేయించడం జరిగిందని తెలిపారు.

తాజాగా ఇదే కేసు విషయంలో నిరుద్యోగులు వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ 24 మంది పిటిషనర్లకు 24000 రూపాయల పైన్ విధిస్తూ కేసు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే విచారణ కాంట్రాక్టు ఉద్యోగ వర్గాలలో ఉత్కంఠ రేపుతోంది

అలాగే ఈ కౌంటర్ పైల్ ను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ (ఏజీ) కి సబ్మిట్ చేయడం జరిగింది. అలాగే ఈ కేస్ లో ఇంప్లిడ్ అయిన అడ్వకేట్ లు అందరికీ ఈ నోట్ ఫైల్ పంపించడం జరిగిందని కనకచంద్రం తెలిపారు.

ఈ కేస్ విషయంలో ఆర్ధిక శాఖ నుండి కౌంటర్ ఫైల్ వేయించడానికి సహకరించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల నాయకులు త్రిభువనేశ్వర్, విశ్వనాథం రాష్ట్ర నాయకులు నరసింహ మరియు హైదరాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలతి పాల్గొన్నారు