ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 2532 రైల్వే ఉద్యోగాలు

ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సెంట్రల్‌ రైల్వేలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2532 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి భారతీయ రైల్వే నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎలాంటి రాతపరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా ఈపోస్టులను భర్తీ చేయనుంది.

● మొత్తం ఖాళీలు :: 2532

● అర్హతలు :: పదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదా దానికి సమానమైన (10 +2 విధానంలో) ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎన్‌టీవీసీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.

● వయోపరిమితి :: 15 నుంచి 24 ఏండ్లలోపు వయస్సు కలిగినవారై ఉండాలి.

● ఎంపిక విధానం :: పదవ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా

● దరఖాస్తు పద్ధతి :: ఆన్లైన్‌లో

● దరఖాస్తులు ప్రారంభం :: ఫిబ్రవరి 6

● చివరితేదీ :: మార్చి 5

● వెబ్సైట్‌ :: https://www.rrccr.com/Home/Home