సీజేఎల్స్ బదిలీల పై అన్ని సంఘాల ఐఖ్యత రాగం.

20 సంవత్సరాలుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకులకు నేతృత్వం వహిస్తున్న దాదాపు ఐదు సంఘాల నేతలు ఈరోజు సమిష్టిగా కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల ఎదుర్కొంటున్న బదిలీలు మరియు ప్రధాన సమస్యలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కలిసి ఒకే అభిప్రాయం తెలియపరచడం శుభసూచకం.

ఈరోజు ఉదయం రైతు బంధు సమితి కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఐదు సంఘాల నేతల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి బదిలీలు 100% జరిపించి తీరుతామని తెలిపారు. అలాగే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ ప్రకారం సీఎంవో కార్యాలయం కూడా ప్రకటన చేసిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వీలయినంత త్వరగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే జీవో నెంబర్ 16 పై లాయర్ జీవిఎల్ మూర్తి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి ఈనెల 11వ తేదీన జీవో నెంబర్ 16 పై కేసు విచారణకు వస్తున్న సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాలని కోరడం జరిగింది దీనిపై ఏజీ సానుకూలంగా స్పందించారు. తాజాగా కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసిన విషయం తెలిసిందే.

పల్లా రాజేశ్వర్ రెడ్డి ని కలిసిన పిమ్మట సబితా ఇంద్రారెడ్డి, చిత్రా రామచంద్రన్, ఇంటర్మీడియట్ కమిషనర్ ను కలవాల్సి ఉన్నా వారు అందుబాటులో లేకపోవడంతో వారితో భేటీ ఈ రోజు జరగలేదు.

తదనంతరం అయిదు సంఘాల నేతలు సమావేశమై బదిలీలు మరియు ఇతర కాంట్రాక్ట్ జూనియర్ అధ్యాపకుల సమస్యలపై దీర్ఘ సమాలోచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బదిలీలపైనే కాకుండా భవిష్యత్తులో ప్రతి సమస్యపై కలిసి నడవాలని ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. సోమవారం బదిలీల విషయంలో సంబంధిత అధికారులను కలిసి బదిలీల పై ముందుకు పోవాలని నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో బదిలీలు జరిపించి తీరాలని ఐదు సంఘాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కనకచంద్రం, కొప్పిశెట్టి సురేష్, గాదె వెంకన్న, రహీమ్, కిరణ్, కొండల్, అన్సారీ, వస్కుల శ్రీను, కుమార్, జిల్లా నరసింహ, శోభన్ బాబు, వినయ్, గంగాధర్, నూనె శ్రీనివాస్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.