జీవో 16 పై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది – ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

రెండు రోజుల క్రితం కాంట్రాక్ట్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ విషయం లో హైకోర్టులో కేసు గెలిచిన విషయం మీకు తెలిసిందే.

ఈ నేపథ్యంలో త్వరలో హైకోర్టులో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై వేసిన పిల్ వాదనలకు వచ్చే విషయాన్ని పరిశీలించి, మన హైకోర్టు లాయర్ జీ.వీ.ఎల్ మూర్తి ఆధ్వర్యంలో లాయర్ల బృందం కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ పెద్దలు, గౌరవ ఎమ్మెల్సీ రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు Dr, పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాంట్రాక్టు ఉద్యోగుల / లెక్చరర్ల క్రమబద్ధీకరణ జీవో16 కు సంబంధించిన కేసు విషయాల్ని పూర్వాపరాలను వివరించడం జరిగింది.

ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ జీవో విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గదని ముఖ్యమంత్రి సహకారంతో చిత్తశుద్ధితో గెలవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, సంబంధిత అధికారులతో మరియు అడ్వకేట్ జనరల్ తో మరొకసారి మాట్లాడటం జరిగింది.