జీవో 45 ప్రకారం ప్రైవేటు లెక్చరర్ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి – TLF

ఈ రోజు ప్రైవేట్ మరియు కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకుల సమస్యలపై తెలంగాణ లెక్చరర్స్ ఫోరమ్ (TLF) తరపున హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

అనంతరం ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి ఉమర్ జలీల్ ని ధర్నా అనంతరం కలిసి వినతి పత్రం సమర్పించి అధ్యాపకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించడం జరిగింది.

జీవో నెంబర్ 45 ప్రకారం కరోనా సమయాని కంటే ముందు కళాశాలల్లో పనిచేసిన ప్రతి అధ్యాపకున్ని విధులలోకి తీసుకోవాలని, పెండింగ్ జీతాలు చెల్లించాలని, అధ్యాపకుల డేటా ఆన్లైన్లో పొందు పరచాలని కోరడమైనది.

దీనికి సానుకూలంగా స్పందించిన సెక్రటరీ తొలగించిన అధ్యాపకులను విధులలోకి తీసుకునే విదంగా ఆదేశాలు ఇస్తానని, అధ్యాపకులను విధులలోకి తీసుకొని కళాశాలల యాజమాన్యలకు నోటీసులు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ సందర్భంగా కమీషనర్ కి ధన్యవాదములు తెలుపుతూ వారం రోజుల తరువాత సమస్య పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్ కమీషనరేట్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధ్యాపకులు సిద్ధంగా ఉన్నారని తెలియజేయండి జరిగింది.

ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన అధ్యాపకులు పాల్గొన్నారని
పి.మురళి మనోహర్, యూ. సిద్దేశ్వర్, డా. యాదయ్య తెలిపారు