పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2020 -21 విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ ను పాఠశాల విద్యా శాఖ ఈ రోజు విడుదల చేసింది జూన్ 7వ తారీకు నుంచి జూన్ 16వ తారీకు వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పరీక్ష సమయం ఉదయం 9.30 నుండి మధ్యహ్నం 12.45 వరకు నిర్ణయించారు. గతంలో కంటే 30 నిమిషాలు పరీక్ష సమయం పెంచారు.

కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ఎక్కువ శాతం ఆన్లైన్ తరగతులు జరగడం వలన 2020 – 21 విద్యా సంవత్సరానికి SSC బోర్డు పరీక్షలను 11 పేపర్ లకు బదులు ఆరు పేపర్లకు కుదిస్తూ పాఠశాల విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది.

★ పూర్తి షెడ్యూల్ ::

  • జూన్ – 07 :: పస్ట్ లాంగ్వేజ్
  • జూన్ – 08 :: సెకండ్ లాంగ్వేజ్
  • జూన్ – 09 :: ఇంగ్లీష్
  • జూన్ – 10 :: మ్యాథమెటిక్స్
  • జూన్ – 11 :: పిజికల్ సైన్స్ (50 మార్కులు)
  • జూన్ – 12 :: బయాలజీకల్ సైన్స్ (50 మార్కులు)
  • జూన్ – 14 :: సోషల్ స్టడీస్
  • జూన్ – 15 :: పస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2
  • జూన్ – 16 :: SSC VOCATIONAL COURESES