కాంట్రాక్ట్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా నిరుద్యోగులు వేసిన పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల ల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ లను జీవో నంబర్ 16 ప్రకారం క్రమబద్ధీకరించవద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన 24 మంది నిరుద్యోగులు 2016 లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ లో నిరుద్యోగులు కాంట్రాక్టు లెక్చరర్ లను క్రమబద్ధీకరించడం వలన తమకు లెక్చరర్ ఉద్యోగాలు దక్కే అవకాశాలు ఉండవని కావునా వారి క్రమబద్ధీకరణ నిలిపివేయాలని కోరారు.

అయితే ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీ మరియు న్యాయమూర్తి విజయ్ రెడ్డి ల బెంచి విచారణ సందర్భంగా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం లెక్చరర్ లను క్రమబద్ధీకరించిందా అని ప్రశ్నించగా, ప్రభుత్వం క్రమబద్ధీకరణ కొరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు లాయర్ సమాధానం చేప్పారు.

ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను కొట్టివేస్తూ పిటిషనర్ ల అభియోగాలు గాలిలో మేడలు కట్టినట్టు ఉన్నాయని, పిటీషనర్ కి 10 వేల చొప్పున 24 మందికి 2 లక్షల 40 వేల జరిమానా విధిస్తూ, పిటిషనర్ లు నిరుద్యోగులు కావునా జరిమానాను 24 వేలకి తగ్గిస్తూ తీర్పు చెప్పింది.