కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ పై హైకోర్టు తీర్పు శుభపరిణామం – ఆర్జేడీ సంఘం

కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల క్రమబద్ధీకరణ విషయంలో ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంట్రాక్ట్ లెక్చరర్ ల క్రమబద్ధీకరణ విషయంలో ఎంతో శుభపరిణామమని ఆర్జేడీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు గాదె వెంకన్న, కుమార్ లు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో సంఘం తరఫున లాయర్ల బృందాన్ని కలిసి కోర్టు తీర్పు అనంతరం పరిస్థితులపై చర్చించారు. జీవో నెంబర్ 16 పై మొదటి కేసును ఈరోజు హైకోర్టు కొట్టివేసిందని, అయితే ప్రధానమైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్ 122/2017)ను కొట్టి వేస్తేనే క్రమబద్ధీకరణకు మార్గం సుగమం అవుతుందని లాయర్ల బృందం పేర్కొన్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో వారం పది రోజుల్లోనే సంబంధిత 122/2017 మరియు ఇతర కేసులు హైకోర్టు ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తద్వారా ఇదే అంశంతో ఆ పిల్ ను కూడా వెకేట్ చేయించి కాంట్రాక్ట్ అధ్యాపకుల
చిరకాల కోరికను నెరవేర్చుటకు కృషి చేస్తామని గాదె వెంకన్న కుమార్ లు తెలిపారు.

ఈ సందర్భంగా ఈ ప్రక్రియకు ప్రభుత్వం నుంచి సహకారం అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ల సహకారం తీసుకుని అడ్వకేట్ జనరల్ గారితో కలసి వాదనలు వినిపించి వెకేట్ చేయించడానికి మన లాయర్లు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు…..