బదిలీల విషయంలో పల్లా వ్యాఖ్యలు అర్ధవంతమైనవి – నేనే బదిలీల కోసం పోరాడుతా – మధుసూదన్ రెడ్డి.

నల్గొండ జిల్లాలో కాంట్రాక్టు అధ్యాపకుల ఆత్మీయ సభలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీజేఎల్స్ బదిలీలపై చేసిన వ్యాఖ్యలు అర్థవంతమైనవని ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్ డాక్టర్ పి. మధుసుదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా మధుసుదన్ రెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలో దేశంలోనే అత్యున్నత ప్రమాణాలు పాటిస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, యాక్ట్ – 2 ఆఫ్ 95 చట్టాన్ని పూర్తిగా సవరించి తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2 నాటికి ఉన్న ప్రతి కాంట్రాక్టు ఉద్యోగిని రెగ్యులరైజ్ చేస్తామని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.

సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కారణంగా గాని లేదా ఇతర కారణాల చేత రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను అమలు పరచ లేకపోయింది. ఇదే సందర్భంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఏ ఒక్క అధికారి కూడా నాకు సహకరించ లేదు అని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ యొక్క ప్రకటన, అదేవిధంగా మాట తప్పని మడమ తిప్పని నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కూడా కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఇచ్చిన మాట సందర్భంలో ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నేపథ్యంలో ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారు ఆలోచిస్తన్న విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల కాంట్రాక్టు ఉద్యోగులు అందరూ కూడా అనేక సమస్యలతో బాధపడుతుంటే జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు బేసిక్ పే, 12 నెలల వేతనం ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.

ద్వంద్వ వైఖరి గల ఒక ఎమ్మెల్సీ మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు ఐదు సంవత్సరాలు ప్రామాణికంగా నిర్ణయించిన‌, కేజీబీవీ టీచర్ల బదిలీలు జరిగితే పాత సర్వీస్ మొత్తం కోల్పోవాల్సి వస్తుందని ప్రకటించినప్పుడు కూడా స్పందించని ఎమ్మెల్సీ ఇప్పుడు సీజేఎల్స్ బదిలీల గురించి కాంట్రాక్టు అధ్యాపకుల గురించి మాట్లాడడం హస్యస్పదం అని తెలిపారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కాంట్రాక్టు అధ్యాపకుల బదులీల సమస్యను తీసుకుని వెళ్లి బదిలీలకు ఎలాంటి నిబంధనలు లేకున్నా సీఎం ను ఒప్పించి సానుకూలంగా ప్రకటన చేపించిన మాట వాస్తవం.

ఈ బదిలీల ప్రకటన వచ్చినప్పటి నుండి ఔ కాంట్రాక్ట్ సంఘాల్లో ఉన్నటువంటి విభేదాలు కారణంగానే బదిలీల ప్రక్రియ ఆగిపోయింది అని పల్లా చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజం. కచ్చితంగా ఈరోజు కాంట్రాక్ట్ సంఘాలను మాత్రమే దీనికి బాధ్యత వహించాలని తెలిపారు. వీరికి కాంట్రాక్టు అధ్యాపకులు మరణించిన, బదిలీలు లేక భార్య పిల్లలకు, తల్లిదండ్రులకు దూరంగా ఉండేవారి బాధలు పట్టవు వీరి ఆధిపత్య దోరణే ఈ సంఘాలకు ముఖ్యం.

రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగికి అయినా బదిలీలు జరిగితే లయబులిటి, ఎలిజిబులిటి అనేవే ప్రమాణికం అని అలా కాకుండా వరంగల్ లో ఒకమాట, నల్గొండ లో ఒక మాట చేబుతూ ఇష్టం వచ్చినట్లు విల్లింగ్, మ్యూచువల్ బదిలీలు జరిపితే ఇంటర్విద్యా జేఏసీ తరపున అడ్డుకోని తీరుతామని తెలిపారు.

కాంట్రాక్ట్ సంఘాలకు నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ రాబోయే ఐదు రోజుల్లో బదిలీలపై మీ యొక్క వైఖరి స్పష్టం చేయకపోతే తప్పకుండా 2013లో చేసిన సీజేఎల్స్ బదిలీ మార్గదర్శకాల ప్రకారమే బదిలీలను ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తర్వాత చేపించడానికి కార్యాచరణ రూపొందించి కార్యాచరణలో నేనే నాయకత్వం వహిస్తూ కూడా కచ్చితంగా కాంట్రాక్టర్ బదిలీలు జరిగేంతవరకు పోరాడతానని తెలిపారు.

కాంట్రాక్టు అధ్యాపక మిత్రులందరూ కూడా ఖచ్చితంగా ఈ నిర్ణయానికి మద్దతు తెలుపుతారని ఆశిస్తూ ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్ మీ మధుసూదన్ రెడ్డి.