6వ తేదీ బదిలీలపై పల్లాను కలవడానికి అన్ని సంఘాలు కలిసి రావాలి – కనకచంద్రం

కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల గురించి సీఎం కేసీఆర్ ని ఒప్పించి ముందడుగు వేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని విమర్శించడం సమంజసం కాదని, కాంట్రాక్టు అధ్యాపకుల బదిలీల గురించి పల్లా రాజేశ్వర్ రెడ్డి వాక్యాలను వక్రీకరించడం ఉచితం కాదని కనక చంద్రం ఒక ప్రకటన విడుదల చేశారు.

నల్లగొండలో జరిగిన కాంట్రాక్టు అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం లో ఏ ఒక్క సంఘాన్ని ప్రత్యేకంగా M L C పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించలేదని, సంఘాల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయన్న విషయం మాత్రమే చెప్పడం జరిగిందని, ఏకాభిప్రాయంతో రావాలని కోరడం జరిగిందని తెలిపారు.

నల్గొండ జిల్లా సీజేఎల్స్ ఆత్మీయ సభలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బదిలీలకు సంబంధించిన గైడ్లైన్స్ లని కాంట్రాక్టు అధ్యాపకుల నిర్ణయించాలని, ఎక్కువ మంది అధ్యాపకులకు ఉపయోగకరమైనటువంటి గైడ్లైన్స్ ని తయారు చేస్తానని మనస్ఫూర్తిగా చెప్పినటువంటి పల్లా కి కృతజ్ఞతలు చెబుతూ సీజేఎల్స్ కోసం అన్ని విధాలుగా సహకరిస్తున్న టువంటి ఎమ్మెల్సీ పల్లాను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కనకచంద్రం హెచ్చరించారు.

ఫిబ్రవరి 6 వ తారీఖున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి యొక్క అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందని బదిలీలు కోరుకునే ఏ సంఘాలైన ఏ నాయకులైన హైదరాబాద్ పల్లా నివాసానికి వచ్చి బదిలీలపై అన్ని సంఘాలు అభిప్రాయం చెప్పాలని కోరుతున్నట్లు కనకచంద్రం తెలిపారు.